హాస్యానికి పరిచయం అక్కరలేని పేరు ఆయనది

హాస్యానికి పరిచయం అక్కరలేని పేరు ఆయనది

న్యూస్ వెలుగు : అలనాటి సినిమాల మదుర స్వప్నలను పాటకులతో పంచుకునేదుకు న్యూస్ వెలుగు తెలుగు సినిమా వెలుగు తో  ప్రత్యేక కథనాలను రాసేందుకు ముందుకొచ్చింది. అలా ఎంచుకున్న చిత్రమే “మామగారు “

                       తెలుగు చిత్రసిమలో  బాబు మోహన్ పరిచయం అక్కర లేని పేరు. హాస్యనటుడుగా , నాయకుడిగా ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన నటించిన  “మామగారు” సినిమా బాబు మోహన్  కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా “మామగారు” ఒకటి. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చిత్రసీమలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బాబు మోహన్‌ పోషించిన యాచకుడి పాత్ర ఆయన కెరీర్‌ను  ఒక మలుపును తీసుకువచ్చింది. ఆయన హాస్య ప్రతిభను ప్రేక్షకులకు తెలియజేయడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది.

ఈ సినిమాలోని కామెడీ ఎలిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బాబు మోహన్ , కోట శ్రీనివాసరావు కాంబినేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.  ప్రేక్షకులతో అనుబంధం ఈ సినిమా ద్వారా బాబు మోహన్  మరింత దగ్గరయ్యారు. ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. “మామగారు” సినిమా  తమిళ రీమేక్  . ఈ సినిమా తమిళ చిత్రం “నాన్ పుడిచా మాపిళ్ళై”కి రీమేక్ తీశారు.  దర్శకుడు ముత్యాల సుబ్బయ్య,  సంగీతం రాజ్-కోటి అంధించారు.  ఈ సినిమా హాస్య ప్రియులకు నిజంగా కడుపుబ్బా నవ్వించే విందు అని సినిమా వర్గాల్లో చర్చ నడిసింది.  బాబు మోహన్ ఫ్యాన్స్‌కు   ఈ సినిమా అత్యంత ప్రత్యేకమైనదని చెబుతారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ చిత్రంగా ఈ సినిమా నిలిచిపోయిందని తెలుగు చిత్ర సీమ నిర్మాతలు అంటారు. మీరు ఇంకా “మామగారు” సినిమా చూడకపోతే, తప్పకుండా చూసి చూసిన క్షణాలను సంతోశంగా గడపండి.

Author

Was this helpful?

Thanks for your feedback!