12న నంద్యాల కు మందకృష్ణ మాదిగ రాక

12న నంద్యాల కు మందకృష్ణ మాదిగ రాక

డోన్  న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా డోన్ పట్టణ కేంద్రంలో  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  అక్టోబర్  12న   నంద్యాల కు వస్తునటువంటి కరపత్రాలను  MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి పులి కేశవయ్య మాదిగ విడుదల చేశారు. అనంతరం కార్యక్రమం లో పులి కేశవయ్య మాదిగ మాట్లాడుతూ యస్సీ వర్గీకరణ సాదించి పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత మొదటిసారి మన జిల్లాకు వస్తున్న సందర్భంగా మాదిగలు మాదిగ ఉప కులాలు మరియు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యమ్ యస్ యఫ్ జిల్లా అధ్యక్షులు అనిల్ మాదిగ, యమ్మార్పీయస్ జిల్లా ఉపాధ్యక్షులు చినరాయుడు మాదిగ, యమ్మస్పీ డోన్ మండల అధ్యక్షులు పులి పెద్దయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!