అచ్యుతాపురం ఘటనలో 17 మంది మృతి : హోమ్ మంత్రి

అచ్యుతాపురం ఘటనలో 17 మంది మృతి : హోమ్ మంత్రి

అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం అచ్యుతాపురం సేజ్లోని ” ఎసైన్షియా అడ్వాన్స్ డ్ ప్రైవేట్ లిమిటెడ్ ”  లో
బుధవారం మధ్యానం రెండు గంటల సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో
భావనంలోని ఒక అంతస్తు కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని ఆంధ్ర ప్రదేశ్
హోమ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సంఘటన ప్రాంతాన్ని ఆమె పరిశీలించిన అనంతరం
మీడియాతో మాట్లాడారు.

కొన్ని మిడియాల్లో రియాక్టర్లు పేలుడు సంబావించి ప్రమాదం జరిగిందని  వస్తున్న వార్తలు
అవాస్తవమని ఆమె అన్నారు. సంఘటన ప్రాంతాన్ని నేరుగా ఆమె  పరిశీలించి అక్కడి పనిచేస్తున్న ఉద్యోగులను, అధికారులను అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు.  సాల్వేవెంట లీకేజి వల్ల , విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చునని , దీని పై విచారణ అనంతరం నివేదిక ఇస్తారని వారు తెలిపారు.  రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావచ్చిందని , కంపెనీ యాజమాన్యం ఫోన్ చేసిన , మెసేజ్ చేసిన పట్టించుకోలేదని దీనిపై ఎస్ ఈ జెడ్ లోని చాలా కంపెనీలు ఆడిటింగ్ జరగడం లేదని
ఆమె అన్నారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత వంటి వాటిపై యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని
ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందా.. లేదా  అన్నది విచారణ తరువాత తెలియాల్సి ఉందని ఆమె మీడియా కు
సమాదనం ఇచ్చారు. ఘటనను పరిశీలించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని ఆమె అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!