
స్వచ్ఛత పై ప్రజలకు అవగాహనా ర్యాలీ
హోళగుంద,న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ విజయలలిత హాజరయ్యారు.ఇందులో భాగంగా స్థానిక బస్టాండ్ నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ పై ప్రతిజ్ఞను చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యర్ధాల వినియోగం మరియు బహిరంగ ప్రదేశాలలో పడివేయడం ద్వారా జరిగే కాలుష్యం మరియు కాలుష్యం వలన జరిగే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.అనంతరం గ్రామంలోని ప్రజలకు అవగాహన కొరకు సచివాలయం సిబ్బంది,అంగన్వాడి కార్యకర్తలతో అవగాహన ర్యాలీలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో