ఉత్తమ ఫోటోగ్రాఫర్ పురస్కారం అందుకున్న గుత్తా సునీల్ కుమార్

ఉత్తమ ఫోటోగ్రాఫర్ పురస్కారం అందుకున్న గుత్తా సునీల్ కుమార్

న్యూస్ వెలుగు గుంటూరు:  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పాత్రికేయ విద్యా విభాగం లో దశాబ్దానికి పైగా ఫోటోగ్రాఫర్ గా విధులు నిర్వహిస్తున్న గుత్తా సునీల్ కుమార్ కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ పురస్కారం లభించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో

ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ (IIPC), ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (PAI) వారు ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్బంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో ప్రదర్శన లో

“ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025″ను  గుత్తా సునీల్ కుమార్ అందుకున్నారు.విజయవాడ లోని బాలోత్సవ్ భవన్ లో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ,ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుక కార్యక్రమం లో ఈ అవార్డు ను కార్యక్రమ ముఖ్య అతిథి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ,పాయ్ వైస్ ప్రసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్ ,ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ తమ్మా శ్రీనివాస రెడ్డి,అవనిగడ్డ శాసన సబ్యులు మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ,మాజీ ఎంపీ డా.గోకరాజు గంగరాజు , టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సీఈఓ శ్రీ ఆర్.మల్లిఖార్జునరావు అందచేశారు. ఈకార్యక్రమంలో ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా అధ్యక్షుడు గొల్ల నారాయణరావు,వెంకటరమణ , ఉపాధ్యక్షులు డాక్టర్ కొంపల్లి సుందర్ వివిధ రాష్టాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున వర్సిటీలోని పాత్రికేయ విద్యా విభాగాధిపతి ఆచార్య డాక్టర్ కే జ్యోతిర్మయి,డాక్టర్ జె మధుబాబు తదితరులు అభినందించారు. వర్సిటీ తాత్కాలిక ఉపకులపతి కె గంగాధర రావు,రెక్టార్ ఆచార్య కె రత్న షీలా మణి, తాత్కాలిక రిజిస్ట్రార్ జి సింహాచలం, దూరవిద్యా కేంద్ర సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు వర్శిటీ సిబ్బంది ప్రశంసించారు.

 

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!