
ప్రజా ఉద్యమం పోస్ట్ రావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి
హొళగుంద (న్యూస్ వెలుగు ): మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన ఆలూరులో జరిగే వైసీపీ ప్రజా ఉద్యమం పోరు పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ హొళగుంద నుండి ఢనపురం రోడ్డు అద్వానంగా ఉందని ఇక్కడున్న ప్రజలు మరియు ఆర్టీసీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. నేను పలుమర్లు అధికారులకు చెప్పిన,ధర్నాలు చేసిన,కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు మేలు జరిగే విధంగా 17 మెడికల్ కాలేజీలను శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజ్ ను ప్రారంభించారన్నారు.మిగతా 12 మెడికల్ కాలేజీలు 80% పూర్తి అయ్యాయి,కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు.పేదలకు మేలు జరగాలన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి, కానీ కుటమీ ప్రభుత్వం, ప్రైవేటీకరణ చేస్తూ టీడీపీ నాయకుల బినాములకు ఇస్తుంది చెప్పారు.ప్రశాంతంగా ఉన్న ఆలూరు నియోజకవర్గని టీడీపీ ఇంచార్జ్ గొడవలు ప్రేరేపించాలని చూస్తున్నారు,గొడవలు సృష్టించకుండా అభివృద్ధి చేసి చూపించాలన్నారు.టిడిపి నాయకులకు ఒకటే చెబుతున్న ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదని ఆలోచన చేయాలన్నారు.అలాగే 12వ తేదీ బుధవారం రోజున జరిగే వైసీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు.కార్యకమానికి జడ్పీటీసీలు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచ్లు,విద్యార్థులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు,బివిఆర్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీఉల్లా,జిల్లా ఉపాధ్యక్షులు గిరి,కో కన్వీనర్ లక్ష్మన్న,సోషల్ మీడియా అధ్యక్షులు మౌనిష్,ఎంపీపీ తనయుడు ఈసా,జిల్లా పరిషత్ ఉన్నత చైర్మన్ బావ శేషప్ప,వైస్ ఎంపీపీ భర్త హనుమప్ప,ఎంపీటీసీ మల్లికార్జున,సేక్ష వలి,మల్లయ్య,పార్టీ నాయకులు కాకి పక్కిరప్ప,శంభు లింగ,మరి స్వామి, రామక్రిష్ణ,గోవింద,కొండ అమరేశ్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.



