23 కోట్లరూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేస్తాం: మంత్రి

23 కోట్లరూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేస్తాం: మంత్రి

న్యూస్ వెలుగు పశ్చిమగోదావరి: రాష్ట్రజలవనరుల శాఖా మంత్రిడాక్టర్ నిమ్మల రామానాయుడు శనివారం పశ్చిమ గోదావరిజిల్లా యలమంచిలి మండలం  లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరద సమయంలో కనకాయ లంక కాజ్ వే ముంపుతో రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా నిర్మూలించేలా 23 కోట్లరూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వర్షాలు, వరదల సమయంలో ముందస్తుగా పజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, వరద నష్ట పరిహారం, నష్ట నివారణకు కృషి చేస్తున్నామని చెప్పారు. వరద తగ్గుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వరద ముంపు బాధిత గృహాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రివెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!