
24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ప్రఖర్ జైన్
అమరావతి (న్యూస్ వెలుగు): ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!