
2737.41 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
Amaravathi (అమరావతి) : ఆంధ్రప్రదేశలో ఎన్డీయే కూటమి ఏర్పాటు తరవాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ పథకానికి కావాల్సిన నిధులను ఇప్పటికే విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆఘస్టూ నెల పెన్షన్ గురువారం ఉదయం ఆరు గంటల నుండే ఇచ్చేందుకు మార్గదర్శకాలను ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఆరంభం కాబోతోందని 64.82 లక్షల మందికి పింఛన్లు అందించనున్నారని ప్రభుత్వ ప్రధాన నిరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు . అనంతపురం జిల్లా మడకశిరలో ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనున్నారని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!