29,30 రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి. డివైఎఫ్ఐ
కడప సర్కిల్, న్యూస్ వెలుగు; భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 29,30 న రెండు రోజులు కడప వేదిక గా జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మడియం.చిన్ని,వీరనాల.శివకుమార్ తెలిపారు.ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం కరపత్రాలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వున్న జిల్లా కార్యాలయం నందు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలకు అఖిల భారత అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఎంపీ ఏ. ఏ.రహీమ్ గారు ముఖ్య అతిథి గా హాజరు అవుతున్నారు అన్నారు.అలాగే రాష్ట్రం నలుమూలల నుండి రాష్ట్ర నాయకత్వం సమావేశాలకు హాజరు అవుతున్నారు అన్నారు.ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కడప ఉక్కు రాష్ట్ర విభజన హామీలు అమలే అజెండా గా తీసుకొని చర్చించడం జరుగుతుంది అన్నారు.ముఖ్యంగా విభజన హామీలలో ప్రధాన డిమాండ్ అయిన కడప ఉక్కు ను కేంద్రం నిర్లక్ష్యం వహిస్తూ కాలం గడుపుతూ వస్తున్నది అన్నారు.సంవత్సరాలు గడుస్తున్నా కడప ఉక్కు కు పునాది రాయి పడలేదు అన్నారు. ముఖ్యమంత్రిలు, వారు వేసిన పునాదిరాళ్లు మారుతున్నాయే తప్ప కడప ఉక్కు శంకుస్థాపన మాత్రం జరగలేదు అన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా కేంద్రం అది అమలు సాధ్యం కాదని దటవేసింది అన్నారు.కేంద్రాన్ని నిలసీ రాష్ట్ర హక్కులు రాబట్టడంలో వైఎస్ఆర్సీపీ,టిడిపి, జనసేన విఫలం చెందాయి అన్నారు.అలాగే కడప కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ లో ఉన్న ఎం ఎస్ ఎం ఈ టెక్నాలజీ కేంద్రాన్ని కూడా అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం తరలించడం ఇక్కడి ప్రాంత ప్రజలను అవమానించడమే అన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఉపాధి పరిశ్రమ ఏర్పాటు మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర హక్కులను సాధించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 29 30న రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహలు గుర్రం డేవిడ్ రాజ్ జిల్లా సహాయ కార్యదర్శులు తులసిశ్వర్ యాదవ్ అంజి కడప నగర కన్వీనర్ విజయ్ జిల్లా కమిటీ సభ్యులు గురయ్యా విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.