
5000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం :మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ (న్యూస్ వెలుగు ): ఆళ్లగడ్డ నియోజకవర్గ మండల మరియు గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ మంత్రి భూమా అఖిల ప్రియ పాల్గొన్నట్లు తెలిపారు.
ముందుగా టిడిపి జెండాను ఆవిష్కరించి, నందమూరి తారకరామారావు, భూమా శోభనాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాను. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందిన వారికి నివాళిగా ఒక్క నిమిషం మౌనం పాటించాము. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడమే మన ధ్యేయమన్నారు. ఆళ్లగడ్డలో నేను మాట ఇచ్చిన ప్రకారం 5000 ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు అందించగా, సోలార్ ప్లాంట్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఆళ్లగడ్డ ప్రజల కోసం తీసుకొచ్చామన్నారు. కంపెనీలను ఆళ్లగడ్డకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. టిడిపి కార్యకర్తలపై ఉన్న కేసులు అన్ని తొలగించేలా చూస్తామని, భూమా కుటుంబం ఎల్లప్పుడూ టిడిపి కార్యకర్తల అండగా ఉంటుందన్నారు.

