
50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు
న్యూస్ వెలుగు: రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. మొత్తం రూ. 81,317 కోట్ల పనులను సీఆర్డీఏ ప్రతిపాదించి రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు సిఆర్డీఎ అధికారులు సీఎం కు తెలిపారు. భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!