6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ..? :వైఎస్ షర్మిల

6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ..? :వైఎస్ షర్మిల

న్యూస్ వెలుగు అమరావతి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్ , సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డ్ లు పెట్టడానికి సిగ్గుండాలన్నారు. కూటమి ప్రభుత్వానిది సాగుకు పెద్దపీట కాదు…రైతు మెడమీద కత్తిపీట అని ఆమె అన్నారు.

రాష్ట్ర కోటా మేరకు యూరియా వస్తే మరి ఆ ఎరువులు ఏమైనట్లు ? 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంటే రైతులకు ఎరువు కరువు ఎందుకు ? రైతులకు చేరాల్సిన యూరియా ఏ దారి మళ్లింది ? ఎవరి గోడౌన్లకు అక్రమంగా యూరియా తరులుతోంది ? అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ నిద్ర పోతుందా ? 266 రూపాయలు అమ్మాల్సిన బస్తా ధర బహిరంగ మార్కెట్ లో 500 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారు ? ఇది నిజంగా కొరతనా.. లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్తిమ కొరతనా… ? సీఎం చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  యూరియా బ్లాక్ మార్కెట్ దందా అరికట్టాలని, విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రైవేట్ వ్యాపారులపై తక్షణ తనిఖీలు నిర్వహించాలి. యూరియాను బ్లాక్ చేసిన వాళ్ల పై EC యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ లో అదనంగా అవసరం పడిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియాను వెంటనే సొసైటీల ద్వారా సరఫరా చేయాలని. రాష్ట్ర రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!