మినుము పంట ను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
వైఎస్ఆర్ జిల్లా : ముద్దనూరు మండలం లోని యామవరం గ్రామంలో రైతులు సాగు చేసిన మినుము పంట ను పరిశీలించి నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రైతులు టి.గంగాధర్,పురుషోత్తం ,అంకిరెడ్డి. గంగిరెడ్డి,రైతులు సిద్ధార్థ సీడ్స్ కంపెనీకి చెందిన వైభవ్ SBG 38 రకం మినుము పంట సాగు చేసినట్లు తెలిపారు.అయితే పంట మొత్తం రసం పీల్చే పురుగులు ఆశించింది అని కోరారు.అనగా తెల్ల దోమ ,పచ్చ దోమ,పేను బంక,జాసిడ్స్, మొదలగు వంటి రసం పీల్చే పురుగుల ఉధృతి అధికం అవడం వల్ల పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించింది అని,అలాగే రైతులు రసం పీల్చే పురుగుల ఉదృతిని మొదటి దశలోనే గుర్తించి అరికట్టాలని కోరారు.ఈ తెగులు ఆశించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా పల్లాకు తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకుంటే రైతుకు నష్టము వాటిల్లదని తెలిపారు.అలాగే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడా క్లోపిడ్ అనే మందుతో 5 యమ్.యల్.ఒక కిలో విత్తనానికి పట్టించి ముందు జాగ్రత్త పడాలని తెలిపారు.అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతి ని అరికట్టడానికి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 నుండి 15 అట్టలు పెట్టుకుంటే మంచి పలితం ఉంటుంది అని తెలిపారు.ఈ రసం పీల్చే పురుగుల ఉదృతిని అరికట్టడానికి మొదటి దశలో వేప నూనె 5 యమ్.యల్ లేదా అసిఫెట్ 1.5 గ్రాములు లేదా తయో మితాక్సిము 0.4గ్రాములు లేదా అష్టమా ప్రైడ్ 0.4 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని కోరారు.వైరస్, పల్లాకు తెగులు సోకిన మొక్కలు అక్కడక్కడ కనిపించిన వెంటనే రైతులు వాటిని పీకి వేసి ఒక చోట పెట్టి కాల్చి వేయాలి.లేదా ఏరి వేసి నాశనం చేయాలి. అలాగే ఉంచితే పొలం మొత్తం వ్యాప్తి చెందుతుంది అని తెలిపారు.ఒక విధంగా చెప్పాలంటే వైరస్ లక్షణాలు ఎక్కువ ఉంటే తెగులును అదుపు చేయడానికి వీలు పడదు అని తెలిపారు.అలాగే రైతులు అధిక మోతాదులో నత్రజని (యూరియా)వాడరాదు అని సూచించారు. ఎరువులు ఇష్టానుసారంగా కాకుండా సిఫారసు చేసిన మేరకే వాడుకోవాలని సూచించారు.ఈ తెగులు ఎక్కువగా అధిక వర్షాలు పఎడ్డప్పుడు భూమిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ గా వ్యాప్తి చెందుతుంది అని తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లో రైతులు తెగులు తట్టుకునే రకాలు యల్.బి.జి 752, పి.యూ.31,యల్.బి.జి.758,టి.బి.జి.104 వంటి రకాలను సాగు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ యమ్.పి.ఈ.ఓ.బి.గంగయ్య రైతులు పాల్గొన్నారు.