
ఇంటర్ పరీక్షలకు 7 మంది గైర్హాజరు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు 07మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు చిఫ్ సూపరిండెంట్ వెంకట నారాయణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. తెలుగు పరీక్షకు 170 మందికి గాను 169, హిందీ పరీక్షకు 41 మందికి గాను 40, సాంస్కృతం పరీక్షకు 7 మందికి గాను 5 మంది మరియు వొకేషనల్ జీ.ఎఫ్.సి. పరీక్షకు 44 మందికి గాను 41 మంది విద్యార్థులు హాజరయ్యారని మొత్తం 262 మందికి గాను 255 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను సి.సి. కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

