90 శాతం సబ్సిడీ తో బిందు సేద్యం పరికరాలను అందించిన మంత్రి
ప్రకాశం జిల్లా : కొండపి నియోజక వర్గంలోని మర్రిపూడిలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేసారు. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేలా సన్న, చిన్నకారు రైతులకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 90 శాతం సబ్సిడీ తో బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!