బొల్లవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Kurnool ( కర్నూల్) : కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని టిడిపి నాయకుడు బివిజి మస్తాన్ అన్నారు. ప్రతి నెల పెన్షన్ కార్యక్రమాన్ని పండుగల చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి పెన్షన్ దారులకు నాలుగువేలు పంపిణి చేసినట్లు పంచాయితీ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, టిడిపి, జనసేన నాయకులు బివిజి మస్తాన్, వెంకటరమణ,బివిజి సతీష్, విజయ్ కుమార్, లక్ష్మన్న, మధు, పార్టీ కార్యకర్తలు పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. Journalist LE Mahesh Goud