
ప్రశాంతంగా నీటి పారుదల సంఘం ఎన్నికలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం నీటి పారుదల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఇందులో హోళగుంద నెంబర్ -3 సేక్షన్ నందు ప్రసిడెంట్ గా బడేఘర్ ఉస్మాన్ సాబ్,వైస్ ప్రసిడెంట్ గా సిద్దిక్ సాబ్ లతో పాటు 11 మంది సభ్యులను,నెంబర్ – 4 సేక్షన్ నందు ప్రసిడెంట్ గా మిక్కిలినేని ప్రసాద్,వైస్ ప్రసిడెంట్ గా రామచంద్ర తో పాటు 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే గెజ్జెహళ్లి, హెబ్బటం గ్రామాల్లో కూడా నీటి పారుదల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుబ్బారావు, ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!