
క్రీడల్లో పోరాట స్ఫూర్తి కనబరచాలి
రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా
న్యూస్ వెలుగు, కర్నూలు; క్రీడల్లో పోరాట
క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నిరంతర సాధనే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. జిల్లాలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర బాబు మాట్లాడుతూ నెట్ బాల్ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. కర్నూలులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ ను విజయవంతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ చైర్మన్ ఆనందరావు, వ్యవస్థాకులు నాగరత్నమయ్య, కార్యదర్శి వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు కందుకూరు సూర్యకుమార్, కోచ్ లు రాజశేఖర్, చరణ్, సుప్రియ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.