
తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టానుసారంగా ఆన్లైన్ రికార్డులు మార్పు
*లబోదిబో మంటున్న భాదితులు.
*ఉన్నతాధికారులు కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించాలి.
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రోజు రోజుకి ఇష్టానుసారంగా ఆన్లైన్ రికార్డులు తారుమారు చేశారని భాదితులు మారెమ్మ భర్త సుంకన్న అనే మహిళ కుటుంబ సమేతంగా కార్యాలయానికి వచ్చి కార్యాలయం ముందు నిరసన తెలిపారు.మండల కేంద్రానికి చెందిన సర్వే నెంబర్ – 365/C1 గల వ్యవసాయ భూమి మారెమ్మ పేరిట ఉండేది అయితే సదరు భూమిని ప్రస్తుతం నాగరాజ్ అనే వ్యక్తి పేరిట ఆడంగల్ తారుమారు చేశారు.ఈ రికార్డు ఎలా తారుమారు చేశారని డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ ను నిలదీశారు.ప్రధానంగా అధికారులు పక్క రికార్డులు పట్టుకుని తమ పనులు చేయాలని రైతులు కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు మాత్రం అలాంటి పనులు చేయకుండా ఇలాంటి అక్రమ మార్గంలో పనులను చేయడం ఏమిటని మండిపడ్డారు.అంతేకాకుండా వివిధ పార్టీల నాయకులు బాధితురాలికి మద్దతుగా నిలిచి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కార్యాలయాల పై జిల్లా అధికారులు తనిఖీలు చేసి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.మరియు అధికారులు బాధితురాలికి న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు పంపాపతి,ఎర్రి స్వామి,వీరేశ్,సిపిఎం కార్యదర్శి వెంకటేష్,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.