సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకల్లో ఎం.పి బస్తిపాటి నాగరాజు
న్యూస్ వెలుగు, కర్నూల్; తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా సావిత్రీ బాయి పూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.నగరంలో ని బీ.సీ భవన్ లో బీ.సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీ బాయి పూలే 195వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు..వేడుకల్లో భాగంగా సావిత్రీ బాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎం.పి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రీ బాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు..నేడు మహిళలు విద్యావంతులుగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే అందుకు సావిత్రీ బాయి పూలే చేసిన పోరాటమేనన్నారు.. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న ఆయన సావిత్రీ బాయి పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు..ఇక నగరంలోని బిర్లా గేట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రీ బాయి పూలే విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎం.పి నాగరాజు హామీ ఇచ్చారు. బీ.సీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు..