కలియుగ దైవం సాక్షిగా ఇది  మచ్చ: APCC

కలియుగ దైవం సాక్షిగా ఇది మచ్చ: APCC

అమరావతి కాంగ్రెస్ :    వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పిసీసీ షర్మిల విమర్శించారు.  భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ఆమె అన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం చంద్రబాబు నైజమన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని APCC పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నామన్నారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయి. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిసీసీ  షర్మిలా డిమాండ్ చెశారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS