పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

  – అడ్వకేట్ క్రాంతి నాయుడు, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి

పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి ను మంగళవారం పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి క్రాంతి

నాయుడు కల్పనా ని కలిసి సదుపాయాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ సరైన స్టాఫ్ లేక చిన్న చిన్న సర్జరీలు తప్ప ఇక్కడ ఇతర సదుపాయాలు కల్పించలేక పోతున్నాం అని, సిజేరియన్ డెలివరీ కి అవసరం అయ్యే సదుపాయాలు, స్టాఫ్ లేక సిజేరియన్ చేయడం లేదు అని వైద్యులు తెలిపారు అని అన్నారు. గత 3, 4 నెలలుగా కేవలం అవెరేజ్ గా 20 డెలివర్లులు అవుతున్నాయి, ఓటి టేబుల్ కూడా కోడుమూరు నుండి తెచ్చుకునే పరిస్థితి, ఇక్కడ సరైన సదుపాయాలు ఉంటే ఉన్న వైద్యులతో అన్ని సదుపాయాలు ఇస్తాము అంటున్నా డీఎంహెచ్ఓ, వైద్య విధాన పరిషత్ వారు నిర్లక్ష్యం వలన ఇంతవరకు సిజేరియన్ డెలివరీ లు జరగడం లేదు అన్నట్టు ఉంది, గత 10 ఏళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు మారినా పత్తికొండ ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎక్సేరే మెషీన్ ఉన్నా కొన్ని పరికరాలు లేక నిరుపయోగం లో ఉంది, డెలివరీ కిట్స్ ముందులాగ ఇంకా రావడం లేదు అని అన్నారు. పత్తికొండ డివిజన్ అయ్యాక సి.హెచ్.సి స్థాయి నుండి ఏరియా ఆసుపత్రి స్థాయికి 100 పడకల ఆసుపత్రిని చేయమని గత 7 ఏళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రస్తుత నాయకులు, అధికారులు, ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలి అని క్రాంతి నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇంచార్జి హర్ష వర్ధన్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్, సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!