
దేవర సందర్భంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామంలో గ్రామ దేవర సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు హనుమంతు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఐదు సంవత్సరాల అనంతరం ఘనంగా నిర్వహించే గ్రామ దేవరకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో,ప్రజలకు నీటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు ఆయన తెలియజేశారు.అదేవిధంగా గ్రామంలో కొత్తగా వీధిదీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలుగా జెసిబి ద్వారా కాలువలను శుభ్రపరచి, బ్లీచింగ్ పౌడర్ ను పిచికారి చేసినట్లు ఆయన తెలియజేశారు.గ్రామ దేవరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు.గ్రామ దేవర సందర్భంగా బుధవారం రోజున పగిడిరాయిలో జరిగే దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హాజరవుతున్నట్లు మాజీ జెడ్పిటిసి పగిడిరాయి జగన్నాథరెడ్డి తెలియజేశారు.