నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ సిబ్బంది
కర్నూలు : హోళగుంద మండల పరిధిలోని కోగిలతోట గ్రామ సచివాలయంలో అధికారులు కొన్ని నెలలుగా ప్రజల సమస్యల పై నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వీరేష్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు సచివాలయానికి అడంగల్,1B పత్రాల కొరకు వెళ్తే సచివాలయం అధికారులు ప్రింటింగ్ మిషన్ పనిచేయడం లేదు,ఆ శాఖ అధికారులు రాలేదని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో గత కొన్ని నెలల నుంచి ఒకరిద్దరు తప్ప మిగతా సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం…….గ్రామ ప్రజలకు అవసరమైన క్యాస్ట్ సర్టిఫికెట్లు,ఇన్కమ్ సర్టిఫికెట్లు ఫారం అడిగినా కూడా అవి లేవని చెప్పడం వీళ్లకు సర్వ సాధారణమైపోయిందన్నారు. గ్రామ సచివాలయాలను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే దీనికి కారణమని వారు అన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసశారు. గ్రామ సచివాలయానికి వస్తున్న ఒకరిద్దరు అధికారులు కూడా సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలు పరిస్కరించక పోతే నిరసనలు చేపడమని అధికారులను హెచ్చరించారు . కర్యక్రమంలో తాళ్లూరు తిమ్మప్ప,ఇటీగల బసవరాజు,శేకన్న,పరశురాం,వీరేష్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.