
‘ప్రజావాణి’ తాత్కాలికంగా వాయిదా
Kamareddi District : శాసన మండల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల నుంచి వినతులు తీసుకోవడం కోసం కలెక్టరేట్‌లోని రూమ్ నెంబర్ 25లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అక్కడ అర్జీలు అందజేయవచ్చని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!