
కాలినడకన వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు…
న్యూస్ వెలుగు, శ్రీశైలం: నూతన తెలుగు సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రతినిత్యం వేలాదిమంది కాలినడకతో శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తమ కోరికలు నెరవేర్చినందుకు భక్తులు వివిధ రూపాల మొక్కుబడులతో కాలినడక సాగిస్తూ శ్రీశైలం చేరుకుంటున్నారు. భ్రమరాంబ గౌరీ మాతగా తమకు ఆడపడచుగా భావిస్తూ పుట్టింటి ఆచారంగా ఆమెకు కానుకలు తీసుకెళ్లడం ఆచారంగా గత కొన్ని దశాబ్దాకారంగా కొనసాగుతుంది. శ్రీశైలం వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాటు సిద్ధం చేశారు .ప్రధానంగా కాలినడకన వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.