తప్పుడుకేసులు పెడితే సహించబోము : ఎస్వీ.మోహన్ రెడ్డి

తప్పుడుకేసులు పెడితే సహించబోము : ఎస్వీ.మోహన్ రెడ్డి

కర్నూలు న్యూస్  వెలుగు:  కర్నూలు నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ కుర్చీ విసిరిన ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్పోరేటర్లు,

మున్సిపల్ అధికారులు తప్పుడు కేసులు పెట్టడం సరికాదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు,కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నందు కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ రామయ్య,కార్పొరేటర్లతో కలిసి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో సమయం వృథా చేస్తున్నారని వైసీపీ కార్పోరేటర్ కుర్చీ ముందుకు విసిరి వేశారని ఇది తప్పు కాదన్నారు. ఇలాంటి ఘటనలు అసెంబ్లీలో సైతం చోటు చేసుకుంటాయని అయినా ఎవరిపైన కేసులు పెట్టలేదని కర్నూలులో మాత్రం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.కుర్చీ విసిరి వేస్తే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం దారుణం అన్నారు.ఈఘటనలో దెబ్బలు తగిలాయని తెదేపా నేతలు చెప్పారని.. ఎవరికి తగిలాయో చూపించాలన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అమరావతి శంఖుస్థాపనకు దేశ ప్రధాని నరేంద్రమోడీ రావడం చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్న సినిమా డైలాగ్ లా ఉందని విమర్శించారు.గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓసారి శంఖుస్థాపన చేశారని మళ్లీ ఇప్పుడు రెండో సారి శంఖుస్థాపన చేయాల్సిన అవసరం ఏముందని మోహన్ రెడ్డి ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసి అమరావతిని కట్టించాల్సిన అవసరం ఏముందన్నారు. అనంతరం మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి అప్పులు తప్ప ఏమి ఇవ్వడం లేదుని,లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టం విడ్డూరంగా ఉందన్నారు. కేసు పెట్టిన వ్యక్తి గతంలో మా పార్టీ నుంచి గెలుపొంది దానార్జనే దేయంగా అధికార పార్టీలోకి మారాడన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికీ 12 కార్పొరేటర్ గజిట్ ప్రకారం వైసీపీ కార్పొరేటర్ అని గుర్తుంచుకోవాలని అన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!