8,745 కోట్ల రూపాయలను ఇచ్చాం :మంత్రి నారాలోకేష్

8,745 కోట్ల రూపాయలను ఇచ్చాం :మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు వెలగపూడి : విద్యాశాఖమంత్రి నారాలోకేష్ కీలక విషయాలను ఉండవల్లి నివాసంలో మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం ఓక కుటుంబంలో  ఇద్దరు చదివితే అందులో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు అందించారని వారు అన్నారు. ప్రభుత్వం మాట ఇస్తే అది తూ ఛా తప్పకుండ అమలు చేసిన ఘనత ఓకే కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వారు వైసీపీ పై విమర్శలు చేశారు.

                         మాట ప్రకారమే కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని , ఇప్పటికి కొంతమంది తల్లుల ఖాతాల్లో నగదు పడలేదని అయితే విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం , బ్యాంకు లింకేజి వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

                                              పాఠశాలలో మొదటి తరగతిలో చేరే పిల్లకు సైతం ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు . విద్యార్థులకు అందించాల్సిన పుస్తకాలూ ,  యూనిఫామ్స్ ,షూ , టై వంటి వాటిని అదింస్తున్నట్లు వారు తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ ను చూసి నేర్చుకునేలా విద్యావిధానాణాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి నారాలోకేష్ .ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేయడం జరిగింది. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోమవారం నుంచి అకౌంట్లలో నిధులు జమకానిపక్షంలో జూన్ 26 వరకు సమయం ఇస్తున్నామన్నారు . మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించాను.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS