న్యూస్ వెలుగు డోన్ :

నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ మేనేజర్ శశిభూషణ్ కి వినతి పత్రం అందించినట్లు బిఎస్ఎఫ్ నాయకులు విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకోట విజయభాస్కర్ మాట్లాడుతూ డోన్ నియోజవర్గంలో గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న కాలేజీ విద్యార్థుల సమయాలకు ఆర్టీసీ బస్సు నడపాలని ఈ సందర్భంగా వారు కోరారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంతమందికి హాస్టల్ లో సీట్లు దొరకక అనేక ఇబ్బందులు పడుతూ… హాజరు కాలేక విద్యార్థులు హాజరు శాతం తక్కువ కావడం వల్ల ఎగ్జామ్స్ టైం లో హాల్ టికెట్ల కు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాబట్టి విద్యా సంవత్సరం నుండి ప్రతి గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం వలన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతారని దానికి అనుగుణంగా RTC సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ నాయకులు కొచెర్వు కాంత్, సుదర్శన్, వెంకటేష్, రవికుమార్, ప్రసాద్, జై రామ్ వెంకటేసులు పాల్గొన్నారు.
Thanks for your feedback!