వైఎస్ జగన్ ఆలయ నిర్మాణానికి 28 కోట్లు ఇచ్చారు : ఎంపి

వైఎస్ జగన్ ఆలయ నిర్మాణానికి 28 కోట్లు ఇచ్చారు : ఎంపి

న్యూస్ వెలుగు  వైయస్ఆర్ జిల్లా:

గండి క్షేత్రం  వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి వేదపండితులు  పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం అందించినట్లు  ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం గండి నూతన ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు . గండి క్షేత్రం ప్రసిద్ధిగాంచిన ఆలయం… స్వయంగా శ్రీరాముడు తన బాణంతో గండి ఆంజనేయ స్వామి ప్రతిమను మొలిచాడు..సజీవంగా ఉన్న ఆంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం కోసం శ్రావణమాసంలో లక్షల్లో భక్తులు రావడం సంతోసకరమన్నారు. ఇంతటి గొప్ప ఆలయం పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం పై మదిపడ్డారు. వైయస్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు 28 కోట్లు మంజూరు చేసి 95% పనులు పూర్తి చేసినట్లు తెలిపారు . కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన మిగిలిన ఐదు శాతం పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత నాలుగు శ్రావణమాసాల నుండి భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించడం లేదన్నారు. పూర్తయిన ఆలయాన్ని ప్రారంభించి మూలవిరాట్ విగ్రహ ప్రతిష్ట చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రశ్నించారు. మహా కుంభాభిషేకం చేయడానికి మరో 10 కోట్లు అవసరం ఉంటుందన్నారు.ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్ ను కోరిన స్పందించడం లేదని . జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే CGF గ్రాంట్ కింద 28 కోట్లు ఇచినట్లు తెలిపారు . వచ్చే శ్రావణమాసంలోపు విగ్రహ ప్రతిష్టను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS