రైతులకు డ్రోడ్ల  పంపిణీ

రైతులకు డ్రోడ్ల పంపిణీ

తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారులు,తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్సి డ్రోన్ ను రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు, టిడిపి నాయకులు ఈశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. డ్రోన్ల ద్వారా సులభతరంగా మొక్కలకు మందును పిచికారి చేసుకోవచ్చని వారు తెలియజేశారు. డ్రోన్ల వినియోగం ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని వారు తెలియజేశారు. కావున డ్రోన్లను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు,గ్రామ టిడిపి నాయకులు పాటిల్ ఈశ్వర్ రెడ్డి,కిసాన్ డ్రోన్ గ్రూపు కన్వీనర్ వీరభద్ర రెడ్డి,కో కన్వీనర్ గువ్వల నాగార్జున,గ్రూపు సభ్యులు ఎర్రమీసాల సుంకయ్య ,మహేష్,డీలర్ సుంకన్న, లాలప్ప,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ భాను ప్రకాష్ రెడ్డి,డ్రాగో డ్రోన్ సిబ్బంది,పంచాయతీ సెక్రెటరీ రాజు నాయక్,వ్యవసాయ విస్తరణ అధికారి మల్లేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు నాగార్జున, రవి,గ్రామ రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS