
పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న రైతులు
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల ముక్కెళ్ల గ్రామం నందు మంగళవారం రోజున మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ రామచంద్ర అధ్యక్షతన రైతుల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ రైతుల కొరకు రాయితీ పై ప్రభుత్వం పంచుతున్న వేరుశనగ విత్తనాల గురించి రైతులకు తెలియజేశారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా గురించి మరియు అన్నదాత సుఖీభవ పై ఉన్న రైతుల సందేహాల గురించి రైతులకు ఆయన వివరించారు. అలాగే గ్రామంలో కౌలుకు తీసుకుంటున్న రైతులను కౌలు కార్డు తీసుకోవాలని, అలాగే కౌలు కార్డు యొక్క ఉపయోగాల గురించి రైతులకు ఆయన తెలియజేశారు.అనంతరం మండల వ్యవసాయాధికారి సురేష్ బాబు గ్రామ రైతులతో కలిసి ముక్కెళ్ల గ్రామంలోని పొలాలలో ఉన్న పంటలను పరిశీలించి రైతులకు ఎరువులు మరియు సస్య సంరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మల్లేష్,గ్రామ వ్యవసాయ సహాయకులు తిమ్మప్ప మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.