విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయండి

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయండి

కర్నూలు న్యూస్ వెలుగు :  సెక్షన్ 12 (1) C విద్యా హక్కు చట్టం-2009 ఉల్లంఘించిన కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్ టీఈ పేరెంట్స్ ధర్నా నిర్వహించారు.అనంతరం ప్రజా పరిష్కార వేదికలో డిఆర్ఓకి వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా ఆర్ టిఈ పేరెంట్స్ కమిటీ నాయకులు నగే ష్,మద్దతు తెలిపిన ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయిఉదయ్,రాయలసీమ ఉద్యర్ది సంఘం నాయకులు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుండి డబ్బులు వ సూలు చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కుచట్టం 2009 ప్రకారం ప్రతి అన్ఎయిడెడ్,ప్రవేట్ పాఠశాలలలో 25శాతం సీట్లు ఉచిత నిర్బంధ విద్యా అందించడానికి ప్రభుత్వం చట్టం చేసి అమలు చేస్తూ ఉంటే, చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న మేము దరఖాస్తు చేసుకోవడం ద్వారా మా పిల్లలకు విద్యా హక్కుచట్టం ద్వారా సీట్లు వచ్చాయి.కానీ గత సంవత్సరం కొన్ని పాఠశా లలు విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశాయి.2025-2026 విద్యా సంవత్సరం వం దలాది పాఠశాలలు అడ్మిషన్లను నిరాకరించడం,విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయ డం జరుగుతుందని అన్నారు.విద్యా హక్కు చట్టం-2009నీ ఉల్లంఘించిన పాఠశాలల పై చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు చెప్పారు.ఇప్పటికైనా వి ద్యా హక్కుచట్టం 2009 సెక్షన్ 12 (1) C ప్రకారం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుం డి డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవా లని,అలాగే ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు,విద్యార్థుల తల్లిదండ్రులు,అధికారులతో క లిపి ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ టిఈ పేరెంట్స్ లక్ష్మణ్,శివ,రమేష్,శిరీష,మధు,జక్రియ,హుస్సేన్ పీర,విశ్వనాథ్,పండు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS