
విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల
న్యూస్ వెలుగు అమరావతి : కాంగ్రెస్ పార్టీ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా నేడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. పార్టీ బలోపేతంతో పాటు సాధారణంగా ఉండే చిన్న, చిన్న విబేధాలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించాను. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం అసమర్ధత పాలనపై గొంతు ఎత్తే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలాగే కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. విభజన హామీలు నెరవేరాలన్నా, రాజధాని కట్టాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని పార్టీ క్యాడర్ కు పిలుపు ఇవ్వడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!