
సబ్ రిజిస్టర్ కార్యాలయ తరలింపు కొంతమంది లబ్దికోసమే : కాంగ్రెస్
న్యూస్ వెలుగు డోన్: డోన్ నడిబొడ్డున ఉండే డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను డోన్ పట్టణం వెలుపలకు తరలిస్తున్నారని,డోన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ ను బయటకు తరలిస్తే అనేక రకాల భద్రతా సమస్యలు ఏర్పడతాయని,కనుక బయటకు తరలించకూడదని,డోన్ మరియు డోన్ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను బయటకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని, ఈ నూతన కార్యాలయం పెద్ద వంకను ఆనుకొని భవనాన్ని నిర్మించడం జరిగింది, రాబోయే కాలములో వరదలు వచ్చి ఆఫీస్ మునిగి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆలోచన కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చాడానికి తీసుకున్న నిర్ణయమని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి & న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, డిసిసి ఉపాధ్యక్షులు న్యాయవాది ఉన్నిగొర్ల జనార్దన్ మరియు డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియచేసి ఎస్ ఆర్ ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక డోన్ ఆర్ డి ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి వారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు ప్రజలు రకరకాల పనులైన భూములు, ఇంటి స్థలాలు, భవనాలు,మొదలైన స్థిర, చరాస్థులు కొనుగోలు, అమ్మకాలు గానీ, తనఖా, గాని,ధానవిక్రయాలు గాని,ఇలా అనేక రకరకాల రిజిస్టేషన్ చేయించు కోవడం జరుగుతుంది, ఈ క్రమములో కొనుగోలుదారులు, అమ్మకం దారులు మధ్య పెద్ద మొత్తములో డబ్బు లు చేతులు మారుతుఉంటాయి.ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను పట్టణానికి దూరంగా ఏర్పాటు చేస్తే భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అదే ఆఫీస్ పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రదేశములో ఉంటే ఎటువంటి భద్రత సమస్యలు వచ్చే అవకాశం లేదు. అంతే కాకుండా పక్కనే పోలీస్ స్టేషన్, కోర్టు,ఎమ్మార్వో ఆఫీస్,అన్ని రకాల ఆఫీసులో ఉండడంవల్ల ఏ రకమైనటువంటి పని ఉన్న అతి తక్కువ సమయంలో పనులు జరిగే అవకాశం ఉంది.మరియు ఉంది. కూతబెట్టి దూరంలో బస్టాండు, రైల్వే స్టేషన్ రవాణ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీసు మీదా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది డాక్యుమెంట్ రైటర్లు గాని, కంప్యూటర్ షాప్ లు జిరాక్స్ సెంటర్ లు పెట్టుకొని టైపిస్టులు చాలామంది తక్కువ అద్దెతో షాపులను తీసుకొని ఉపాధి పొందుతున్నారు, గత ప్రభుత్వహయములో ట్రాఫిక్ సమస్యల పేరుతో అక్కడున్నటువంటి షాప్ లను ఇంకో పక్కకి మార్చడం జరిగింది, తద్వారా చాలామంది లక్ష ల రూపాయలు ఖర్చులు పెట్టుకొని బంకులను, (షాప్) ఏర్పాట్లు చేసుకున్నారు, మరి ఇప్పుడు పట్టణం వెలుపలకు మార్చితే లక్షల రూపాయలు వృధా అవ్వడమే కాక వారి జీవనోపాధి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది
కనుక డోన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ ప్రస్తుతం ఎక్కడైతే ఉందొ అదే ప్రాంతములో యదా స్థితిని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.లేని పక్షములో అన్ని రాజకీయ పార్టీ లను, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చే పడతాం అని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం క్రమములో కాంగ్రెస్ పార్టీ డోన్ పట్టణ అధ్యక్షులు వై శేఖర్ యాదవ్, ప్యాపీలి మండల అధ్యక్షులు ఎస్ మహేంద్ర నాయుడు, నంద్యాల డిసిసి ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, డిసిసి కార్యదర్శి మధు సుధన్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు హనుమాన్,సీనియర్ న్యాయ వాది డాక్యుమెంట్ రైటర్స్ గుండాలశ్యాంసుందర్,ఆర్.సుదర్శనరావు,ఆర్.గోపినాథరావ్,వెంకటరమణ,రంగయ్య,శ్రీరామచంద్రుడు,ఎ.నాగరాజు,ఎ.వెంకటేష్, పోలులక్ష్మిరెడ్డి,నారాయణ,ఏ.వెంకటస్వామి,గోల్లమల్లికార్జున,శ్రీకాలువఆదినారయణ,మోహన్, చందు, భారతి, రమేష్ బాలరాజు, అబ్దుల్, ఇష్మాయిల్,వెంకటేష్,నరసింహుడు,చిరంజీవి,నాగరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.