
దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూస్ వెలుగు తెలంగాణ : ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడినా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడుతమని ప్రజలకు బరోస ఇచ్చారు. కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో ఎవ్వరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు , వినియోగం వివాదాలు అన్న అంశంపై జరుగుతున్న పరిణామాలపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమర్క్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.