గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

కర్నూలు :  గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు   ఘనంగా జరిగాయని పాఠశాల ప్రధానాచార్యులు మెహరున్నీసా తెలిపారు .

గురువారం ఉదయం పాఠశాల మైదానం లో జరిగిన వేడుకల్లో పాఠశాల కరెస్పాండంట్ మిన్నల్ల, ఉపాద్యాయుడు రంగస్వామి జాతీయ జెండా ఎగురవేశారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మిన్నల్లా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ పురోభివృద్దికోసం విద్యార్థులు   పాటుపడాలని పిలుపునిచ్చారు.

పాఠశాల ప్రధానాచార్యులు కే .మెహరున్నీసా మాట్లాడుతూ విద్యార్థులు భావిభారత పౌరులుగా , ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థుల ఆటపాటలు ,దేశ నాయకుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి .ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!