చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి: డిప్యూటి సీఎం

చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి: డిప్యూటి సీఎం

న్యూస్ వెలుగు సినిమా : జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు  డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.  71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి , సహుగారపటి , నిర్మాతలు  , హరీష్ పెద్ది లకు అభినందనలు తెలిపారు.

ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ఎంపికైన ‘హను-మాన్’ చిత్రం నిలిచిందన్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంతి వర్మ , వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా  నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయిత , కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడు శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్రీ నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయన్నారు. జాతీయ ఉత్తమ నటులుగా ,  విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా  సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!