తొలగించిన పెన్షన్స్ ను పునరుద్దరించండి: సీపీఎం

తొలగించిన పెన్షన్స్ ను పునరుద్దరించండి: సీపీఎం

న్యూస్ వెలుగు తుగ్గలి: ఏళ్ల తరబడి తీసుకుంటున్న వికలాంగుల పెన్షన్ లను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో తొలగించడం బాధాకరమని తుగ్గలి మండలం సీపీఎం కన్వీనర్ శ్రీరాములు ఎంపీడీఓ కి సోమవారం వినతిపత్రం అందించిన అనంతరం మీడియా తో మాట్లాడారు. వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే సదరం సర్టిఫికెట్ వికలాంగుల కు కీలకంగా మారుతుందని అయితే సదరం క్యాంపు లో ఉంటున్న డాక్టర్లు రోగులకు కనీసం 5నిమషాలు కూడా కేటాయించకుండా, సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండానే క్యాంపులోని కొంతమంది కనుసన్నలో సర్టిఫికెట్లు అందుతున్నాయానే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయన్నారు. సదరం క్యాంపుల నిర్వహణపై జిల్లా వైద్యాధికారులు, తగిన చర్యలు తీసుకోవాలని తొలగించిన వికలాంగుల పెన్షన్స్ ను వెంటనే పునరుద్దరించాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల సంఘం నాయకులు ప్రసన్న కుమారి, రామాంజినేయులు, అంజి, జి సత్యనారాయణ, గోవిందరాజులు, మల్లికార్జున, జానకమ్మ, వెంకటమ్మ, గీతమ్మ, రమేష్, తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!