
తెలుగు వారికి దక్కే గౌరవం ఇదే : వైఎస్ షర్మిల
న్యూస్ వెలుగు అమరావతి: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి . దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయరంగ నిపుణులు ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగం పరిరక్షించ బడుతుందని ఇండియా కూటమి బలంగా నమ్ముతుందని వైఎస్ షర్మిల అన్నారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగు వారికి దక్కిన గౌరవంగా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇదే నని ఆమె గుర్తుచేశారు. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే సమయం ఇదన్నారు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. సుదర్శన్ రెడ్డి ని తెలుగు బిడ్డగా పరిగనణలోకి తీసుకుని,న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ, రాజకీయాలు ఆపాదించకుండా టీడీపీ, జనసేన జనసేనపార్టీ ,వైసీపీ , BRS పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.