
అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం
న్యూస్ వెలుగు అమరావతి: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి YCPకి సిగ్గుండాలి. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది YCPకి కనిపించదు. మోడీ గారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి YCP నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో RSS చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోడీ గారికి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు YCP సమాధానం చెప్పాలి.