
వేరుశనగ బోర్డు ఏర్పాటు చేయండి : ఆర్.పి.ఐ పార్టీ
న్యూస్ వెలుగు అమరావతి: రాయలసీమలో వేరుశనగ బొడ్డులు ఏర్పాటు చేయాలని ఆర్పిఈ పార్టీ రాష్ట్ర నాయకులు హుస్సేనప మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమలో లక్షల ఎకరాలు వేరుశెనగ సాగు చేయడం జరుగుతుందని, రైతులు వేరుశనగలు ప్రధాన పంటగా వేయడంతో పాటు కరువు సీమలో వేరుశనగలు అధిక మొత్తంలో సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేరుశనగబోటు ఏర్పాటుకు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఇప్పటికైనా కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి జనసేన తెలుగుదేశం కూటమిగా ఉన్నారని కేంద్రం సహకారంతో వేరుశనగ బోర్డు ఏర్పాటు చేయడం తెలపతరం అవుతుందని ఆయన అన్నారు ఇప్పటికే కదిరిలో వేరుశనగ పరిశోధన కేంద్రం మాత్రమే ఉందని ఇప్పుడు, వేరుశనగబోడు ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధరతో పాటు వేరుశనగ సాగు మరింత విస్తరణలో పెరిగేందుకు అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వేరుశనగ శాతం ఎక్కువగా అనంతపురం చిత్తూరు కర్నూలులో అధికంగా సాగు చేయడం జరుగుతుందన్నారు. గత మూడు సంవత్సరాలలో వేరుశనగ సాగు తగ్గుతుందని దీనివల్ల రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు రైతులకు సబ్సిడీల రూపంలో న్యాయమైన విత్తనాలను అందించడంతోపాటు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయా ప్రభుత్వాలు వేరుశనగ బొడ్డును ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందని వారు అన్నారు. ఆర్.పి.ఐ పార్టీ అద్వాలే ద్వారా ఇప్పటికే పలుమార్లు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు వెల్లడించారు.