
మణిపూర్,గోద్రా అల్లర్లు ఇందుకు నిదర్శనం: వైఎస్ షర్మిల
న్యూస్ వెలుగు అమరావతి : APCC మైనారిటీ డిపార్టెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేడు పాల్గొన్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన మైనారిటీ హక్కులపై పోరాడాల్సిన అంశాలపై దిశా- నిర్దేశం చేయడం జరిగింది. మతతత్వ బీజేపీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు. మైనారిటీ హక్కులకు విలువ లేదు. హిందూ – ముస్లిం భాయ్ భాయ్ అనేది కాంగ్రెస్ సిద్ధాంతం. హిందూ- ముస్లిం,క్రిస్టియన్ మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ సిద్ధాంతం. ఆ మంటల్లో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం.
మతం పేరుతో,విభజన పేరుతో బీజేపీ దేశంలో కుంపట్లు పెడుతోంది. మతాలుగా ఈ దేశాన్ని విభజిస్తుంది. ముస్లింల చట్టాలు అంటే బీజేపీకి లెక్కలేదు. CAA, వక్ఫ్ బోర్డు సవరణ, ఆర్టికల్ 370, అయోధ్య రామమందిరం లాంటి వివాదాలతో ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. మోడీ గారు అభినవ బ్రిటిషర్. విభజించు-పాలించు లాంటి బ్రిటీష్ సిద్ధాంతాలను మోడీ అమలు చేస్తున్నారు. దేశంలో మణిపూర్,గోద్రా అల్లర్లు ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలో టీడీపి , జనసేనాపర్టీ , వైస్సార్సీపార్టి పూర్తిగా బీజేపీ బీజేపి ఇండియా తొత్తులే. టీడీపీ, జనసేనది బహిరంగ పొత్తు అయితే YCP అధ్యక్షుడు జగన్ గారిది అక్రమ పొత్తు. జగన్ గారు బీజేపీకి దత్తపుత్రుడు. సెక్యులర్ పార్టీల ముసుగులో మైనారిటీలను టీడీపీ, వైసీపీలు దారుణంగా మోసం చేస్తున్నాయి. మైనారిటీల ప్రయోజనాలు దెబ్బతీసే అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. YSR కొడుకు అయ్యి ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణం. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు మైనారిటీలను ఉద్ధరించింది శూన్యం. గత 10 ఏళ్లుగా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
చంద్రబాబు, జగన్ ఇద్దరు మైనారిటీల ద్రోహులే. 45 ఏళ్లు, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. అలాగే మైనారిటీ సబ్ ప్లాన్ కూడా మోసమే. ముస్లిం నిరుద్యోగులకు రూ.5 లక్షల సహాయం, వడ్డీ లేని రుణాలు అంటూ మభ్యపెట్టారు. రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైఎస్ షర్మిల అన్నారు.