
ప్రజలను అప్రమత్తం చేయండి: మంత్రి సత్యప్రసాద్
న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్రరెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ కీలక సూచనలు చేశారు. కోస్తాంధకు ఉపరితల అవర్తన ప్రభావంతో ఆరెంజ్ అలెర్జ్ జారీ చేయడంతో అధికారులంతా సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ,ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పజలను అపమత్తం చేయాలని తెలిపారు. పకాశం బ్యారేజీ నుండి 3 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది పరివాహక ప్రాంత పజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల పజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు, పభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్రతీరంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అయితే పజలు ఆందోళన చెందవద్దని, ఎటువంటి విపత్తు అయినా ఎదుర్కునేందుకు పజల ప్రాణ, ఆస్తిరక్షణకు రాష్ట్రపభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిస్పష్టం చేశారు.