రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ఆసుపత్రి సూపరిండెంట్ 

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ఆసుపత్రి సూపరిండెంట్ 

కర్నూలు (న్యూస్ వెలుగు ): కర్నూలు వైద్య కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య పరీక్షలతో పాటు వారికి అందించాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందించే వైద్య సదుపాయాలు మెరుగైనవిగా ఉండాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించారు.అవసరమైన ఔషధాలు, పడకలు, పరీక్షా పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా సంబంధిత విభాగాలను ఆయన ఆదేశించారు.

ఆసుపత్రిలోని అన్ని విభాగాల హెచ్వోడీలతో సమన్వయం బలోపేతం చేసి పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందించాలని తెలిపారు

ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డి ఎం ఈ & ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ, ఆసుపత్రి ఇన్చార్జి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ, డా.పద్మజ, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం మరియు సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, రేడియాలజీ, తదితర అన్ని విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS