
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
పల్నాడు (న్యూస్ వెలుగు ): పల్నాడు జిల్లా మాచర్లలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.. కార్యక్రమంలో భాగంగా స్థానిక చెరువు వద్ద పారిశుధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చెత్తను మొత్తం తొలగించి శుభ్ర పరిచారు. ఆ ప్రాంతంలో కూర్చునేందుకు సిమెంట్ బల్లలు వేసి, మొక్కలు నాటారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన పారిశుధ్య కార్మికులను సీఎం అభినందించారు. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పచ్చదనం పెంచేలా చెట్లు నాటడం ప్రశంసనీయం అని ఆయన అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!