ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి… బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన కలెక్టర్ 

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి… బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన కలెక్టర్ 

 కర్నూలు (న్యూస్ వెలుగు) : కర్నూలులోని దేవనగర్‌లోని కెసి కెనాల్ వద్ద హృదయ విదారక విషాదం సంభవించింది. కర్నూలులోని SAPలోని CRR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ లో 7 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సెప్టెంబర్ 25 వతేదీ సాయంత్రం, ఈత కొట్టడానికి కేసి కెనాల్ కు వెళ్లి, దురదృష్టవశాత్తూ, వారు నీటి ప్రవాహం ఉధృతం కావడం వల్ల కొట్టుకు పోయారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించగా ఒక మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం పంపగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ సానుభూతిని తెలపగా తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. దసరా సెలవుల్లో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమే సూచించారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!