
ఏపీ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…!
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : శనివారం(27-09-25) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని, రాష్ట్రంలో1-2చోట్ల అతిభారీ వర్షాలు, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర,ఉభయగోదావరి,నెల్లూరు, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు.