
సిఐఐ సదస్సు ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించిన వివిధ కమిటీల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష నిర్వహించింది. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పటిష్ట ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమం అజెండాతో పాటు వేదిక రూపకల్పన, నమూనాపై సమీక్షలో చర్చించాం. ఈ సందర్భంగా భాగస్వామ్య సదస్సు-2025 అధికార వెబ్ సైట్ ను మంత్రివర్గ ఉప సంఘం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, నారా లోకేష్, బిజీ పీజీ భరత్, కందుల దుర్గేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.